వెస్ట్ బెంగాల్‎లో రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన బోగీలు

Update: 2023-06-25 03:39 GMT

పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. ఓండా రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు రెండు గూడ్స్ రైళ్లు ఢీ కొన్నాయి. దీంతో మరోసారి విషాదకరమైన బాలాసోర్ రైలు ప్రమాదాన్ని గుర్తు చేసింది. ఈ ప్రమాద ఘటనలో 12కు పైగా బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు ఓ గూడ్స్ రైలు ఇంజన్ మరో బోగీపైకి చేరింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే శాఖ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుంది. పునరుద్ధరణ పనులను చేప్టటింది. దీంతో ఖరగ్‌పూర్-బంకురా-ఆద్రా లైన్‌లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు అధికారులు. ప్రథమ నివేదికల ప్రకారం ఒక గూడ్స్ రైలు మెయిన్ లైన్‌కు బదులుగా లూప్ లైన్‌లోకి ప్రవేశించి ట్రాక్‌పై ఉన్న మరొక గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. రెండూ గూడ్స్ రైళ్లు కావడం ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. 



Tags:    

Similar News