ట్రాన్స్‌జెండర్ల పైశాచికం.. గుండు కొట్టించి, ఉచ్చపోసి..
దేశంలో కొత్త రకం అఘాయిత్యాలు మొదలయ్యాయి. భౌతిక దాడులు, హత్యలు, గాయాలతోపాటు ‘మూత్రదాడి’ సంఘటనలు పెచ్చరిల్లుతున్నాయి. ఏపీ, యూపీ, ఎంపీ.. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేకుండా ఉచ్చదాడులు పెరుగుతున్నాయి. దళితులపై, గిరిజనులపై అమానుషంగా మూత్రం పోసి, అదేదో ఘనకార్యమన్నట్లు వీడియో తీసుకుంటున్నారు. ఈ జాడ్యం కేవలం మగవాళ్లకే కాదు, చివరికి ‘అక్కయ్యలకు’ కూడా అంటుకుంది. కొంతమంది ట్రాన్స్‌జెండర్లు ఓ అభాగ్యుడిపై మాటల్లో చెప్పలేని ఘోరానికి తెగించారు. అతణ్ని దోచుకుని, గుండు కొట్టించి, మూత్రం పోశారు. తాగు తాగు అంటూ బలవంతం చేస్తూ తమదైన స్టయిల్లో చప్పట్లు కొట్టారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. రాఫికుల్ అనే వ్యక్తి ఒక ట్రాన్స్‌జెండర్ దగ్గర పనిచేసేవాడు. అయితే ఏదో సమస్యతో ఆమె దగ్గర పని మానేసి మరో ‘అక్కయ్య’ దగ్గర చేరాడు. దీంతో మొదటి అక్కయ్య అతనిపై పీకల్లోతు కోపం పెంచుకుని సమయం కోసం వేచి చూసింది. మరో నలుగురు బాయ్యలతో కలసి అతణ్ని దారిలో అడ్డుకుంది. అతని దగ్గరున్న 10 వేల రూపాయలు గుంజుకున్నారు. తర్వాత కాట్లు పడేలా ఘోరంగా గుండు గీయించి మూత్రం పోశారు. బలవంతంగా మూత్రం తాగించబోయారు. జూలై 26న జరిగిన ఘోరం వీడియో తాజాగా బయటికొచ్చింది. రాఫికుల్ ఫిర్యాదుతో పోలీసులు ట్రాన్స్‌జెండర్లు అదుపులోకి తీసుకొని జైల్లోకి నెట్టారు.