తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియెన్‌పై రాజ్యసభలో సస్సెన్షన్ వేటు పడింది. గురువారం నుంచి శీతాకాల సెషన్ ముగిసేవరకు ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. రాజ్యసభ నిబంధనలు ఉల్లంఘించారని, వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారని, క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించడంతో ఆయనను సస్పెండ్ చేశామని జగదీప్ ధన్‌ఖడ్ చెప్పారు.
బుధవారం(నిన్న)మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకడంతో సభలో తీవ్ర అలజడి చెలరేగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై చర్చ జరగాలని గురువారం సభలో ఓబ్రియెన్ డిమాండ్ చేశారు. సభలో ఆందోళన చేయడంతో ఆయనపై ధన్‌ఖడ్ ఆగ్రహానికి గురయ్యారు. ‘డెరెక్ వెంటనే సభ నుంచి బయటకు వెళ్లిపోవాలి. సభ నిబంధనలను గౌరవించనని ఆయన చెప్పారు. ఇది తీవ్రమైన ఉల్లంఘన. ఇది సిగ్గుచేటు’ అని ఎంపీపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఛైర్మన్ ప్రకటించారు. ఈ సెషన్ మొత్తం ఓబ్రియెన్పైవేటు కొనసాగనుంది. రాజ్యసభ చైర్మన్ ప్రకటనను విపక్ష సభ్యులు వ్యతిరేకించారు.