ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర..సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ప్రతిభను చాటి చెప్పే వీడియోలను ఆయన షేర్ చేస్తుంటారు. అదే విధంగా ఇంట్రెస్టింగ్ అంశాలతో పాటు..ఆసక్తికర దృశ్యాలను పంచుకుంటారు. తాజాగా మరో వీడియోతో ముందుకు వచ్చారు. అయితే ఈ సారి ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన వీడియో నెటిజన్లను భయం పెట్టింది.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ముందుగా ఒక ఫోటోగ్రాఫర్ కనిపిస్తున్నాడు. అతడు జీప్ ముందు భాగంలో కూర్చుని అడవిలోని, వన్యమృగాలను చిత్రీకరించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇంతలో ఓ సింహం అతడికి దర్శనమిచ్చింది. నెమ్మదిగా అడుగులేస్తూ ఫోటోగ్రాఫర్ ముందుకు వచ్చింది.
సింహాన్ని చూసిన ఆ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. ఏం చేయాలో తెలియక భయంతో అలా ఉండిపోయాడు.
https://twitter.com/anandmahindra/status/1667421376804974592?s=20
ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా రెండు ప్రశ్నలను సంధించాడ. ఒకటి.. ఆ స్థానంలో మీరు ఉంటే మొదట ఏం ఆలోచిస్తారు. రెండు 'మొదట మీరు ఏం చేస్తారు' అని నెటిజన్లను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆనంద్ మహీంద్ర ప్రశ్నలకు యూజర్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.