బీజేపీ సంచలన నిర్ణయం.. మధ్యప్రదేశ్‌ సీఎంగా మోహన్‌ యాదవ్‌

By :  Krishna
Update: 2023-12-11 12:05 GMT

బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ సీఎంగా ఎవరూ ఊహించని వ్యక్తిని ఎంపిక చేసింది. సౌత్ ఉజ్జయిని ఎమ్మెల్యే మోహన్ యాదవ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, ప్రహ్లాద్ పటేల్, నరేంద్ర సింగ్ తోమర్ సీఎం రేసులో ఉన్నప్పటికీ.. అధిష్టానం మాత్రం మోహన్ యాదవ్ను తెరమీదకు తెచ్చింది. బీజేపీ అధిష్ఠానం దూతలు శివరాజ్ సింగ్ చౌహాన్తో తీవ్ర చర్చలు జరిపిన తర్వాత మోహన్ యాదవ్ పేరును ప్రకటించారు. కాగా మోహన్ యాదవ్ ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తి.

అదేవిధంగా జగదీష్ దేవదా, రాజేంద్ర శుక్తా డిప్యూటీ సీఎంలుగా వ్యవహరించనున్నారు. కాగా మోహన్ యాదవ్ 2013లో ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక 2018లోనూ గెలిచిన ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలిచిన మోహన్ యాదవ్ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.


Tags:    

Similar News