Bridge collapse : కుప్పకూలిన బ్రిడ్జి.. తప్పిన పెను ప్రమాదం..

Byline :  Kiran
Update: 2023-10-16 16:33 GMT

మహారాష్ట్రలో దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లై ఓవర్ కుప్పకూలింది. రత్నగిరి జిల్లాలోని ముంబయి - గోవా హైవైపై ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. నిర్మాణలోపం కారణంగానే ఫ్లై ఓవర్ కుప్పకూలిందని ప్రాథమికంగా నిర్థారించారు. ఫ్లై ఓవర్ కుప్పకూలుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

రత్నగిరి జిల్లాలోని చిప్లణ్ నగర్ ప్రాంతంలో ముంబయి - గోవా నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు. అయితే నాణ్యతాలోపం కారణంగా ఓ చోట బ్రిడ్జికి పగుళ్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ముందుజాగ్రత్త చర్యగా అటువైపు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసు సిబ్బందిని మోహరించారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో పక్కన రోడ్డుపై వెళ్తున్న జనం పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.




Tags:    

Similar News