Women reservation bill: బ్రేకింగ్.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
By : Mic Tv Desk
Update: 2023-09-18 16:33 GMT
చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంటులో, అసెంబ్లీలో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన బిల్లును కేబినెట్ ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.