Bharati Pawar:పద్ధతి మార్చుకోకపోతే కేంద్రం నుంచి నిధులివ్వం.. కేంద్రమంత్రి

Byline :  Veerendra Prasad
Update: 2024-01-08 04:47 GMT

కేంద్ర ప్రభుత్వ పథకాలకు గుర్తింపు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి పవార్‌ ఆరోపించారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ.. పర్యటనలో భాగంగా ఆరోగ్య కేంద్రాలను పరిశీలించగా.. బోర్డుల్లో ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రాధాన్యం కన్పించడం లేదన్నారు. ప్రధాని మోదీ ఫొటోలు కూడా కనిపించకుండా మాయం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల మంజూరును నిలిపేయడానికి వెనకాడబోమని హెచ్చరించారు.

‘ఏపీలోని 26 జిల్లాల్లో 125 వాహనాలతో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నాం. 35 లక్షల మంది ఇందులో భాగస్వామ్యం అయ్యారు. అర్హత ఉన్న వారు ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆరోగ్యపరమైన పరీక్షలు నిర్వహించి మందుల్ని ఉచితంగా ఇస్తున్నాం. 1,672 గ్రామాల్లో హర్‌ ఘర్‌ జల్‌ పథకం అమలు చేశాం.భూమి రికార్డుల్ని 5,292 గ్రామాల్లో పూర్తి చేశాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని ఆయుష్మాన్‌ ఆరోగ్యమందిర్‌గా మార్చాం’ అని భారతీ పవార్‌ తెలిపారు.

Tags:    

Similar News