అధిష్టానం పిలుపు.. హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి

Update: 2023-06-24 06:05 GMT

కర్నాటకలో ఓటమి తర్వాత తెలంగాణలో బీజేపీ డీలా పడింది. పైగా అంతర్గత పోరుతో సతమతమవుతున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్ర పరిస్థితిపై బీజేపీ అధిష్ఠానం దృష్టి సారించింది. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు పార్టీ మారుతున్నారనే ప్రచారంతో వారిని ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించింది. దీంతో వారు ఢిల్లీ వెళ్లారు.

ఈ క్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కూడా అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. దీంతో హైదరాబాద్ లో ఇవాళ్టి కార్యక్రమాలను రద్దు చేసుకుని వెంటనే ఢిల్లీ వెళ్లారు. ఈటల, కోమటిరెడ్డిలతో జరిగే సమావేశంలో కిషన్ రెడ్డి కూడా పాల్గొంటారని తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, బాధ్యతల అప్పగింతపై వీరితో జాతీయ నేతలు చర్చించే అవకాశం ఉంది.

అంతేకాకుండా బండి సంజయ్ను అధ్యక్షుడిగా తప్పించాలని ఈటల సహా పలువురు నేతలు జాతీయ నేతలుకు చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అధిష్టానం నుంచి మాత్రం ఎటువంటి ప్రకటన లేదు. పైగా ఈటలకు ఈ పదవిని కట్టబెట్టడాన్ని పలువురు సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో అధిష్టానం పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగింది. 


Tags:    

Similar News