Nitin Gadkari : అయోధ్య మత సమస్య కాదు.. జాతీయ సమస్య: నితిన్ గడ్కరీ

Byline :  Bharath
Update: 2024-01-15 03:46 GMT

అయోధ్య ఆలయంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి ఇంకా వారం రోజులే మిగిలుంది. జనవరి 22న జరిగే వేడుకకోసం.. అయోధ్య సుందరంగా ముస్తాబవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అయోధ్య రామమందిరంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయోధ్య మతపరమైన సమస్య కాదని, జాతీయ సమస్య అని చెప్పుకొచ్చారు. దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వానికి.. గౌరవం, గర్వం తిరిగిచ్చేందుకే ఈ ఆలయం నిర్మించాలనే ఉద్యమం జరిగిందన్నారు. రామ జన్మభూమిలో రామమందిర నిర్మాణం.. దేశప్రజలకు గర్వకారణం. ఆత్మగౌరవానికి చిహ్నం అని గడ్కరీ చెప్పారు.

అయోధ్య ఉద్యమం రామాలయం కోసం మాత్రమే కాదని ఆయన చెప్పారు. దేశంలో అందరికీ న్యాయం జరిగేలా, శాంతియుతంగా ఉండేందుకు అవగాహన కల్పించడం దీని ఉద్దేశమని గడ్కరి అన్నారు. చరిత్ర, సత్యం, సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయం జరిగిందని ఆయన ఆభిప్రాయపడ్డారు. నాగ్ పూర్ లోని ఓ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 




Tags:    

Similar News