WFI : కేంద్రం సంచలన నిర్ణయం.. డబ్ల్యూఎఫ్‌ఐ కొత్త ప్యానెల్ సస్పెండ్
Byline : Krishna
Update: 2023-12-24 06:37 GMT
భారత క్రీడాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త ప్యానెల్‌ను సస్పెండ్ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్ గోండాలో జరిగే కుస్తీ పోటీలకు తొందరపాటుగా అండర్-15, అండర్-20 జట్లను ఎంపిక చేసినందుకుగాను క్రీడా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పారదర్శకత, ఇతర కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా కొత్తగా ఎన్నికైన సంజయ్ సింగ్.. గత అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు అత్యంత సన్నిహితుడు. ఈ క్రమంలో రెజ్లర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్ మెంట్ ప్రకటించగా.. మరో రెజ్లర్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలో క్రీడా శాఖ కొత్త ప్యానెల్ ను సస్పెండ్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.