గ్యాంగ్స్టర్ కబ్జా భూమి లాక్కొని.. పేదలకు ఇళ్లు కట్టించాడు

Update: 2023-06-30 11:11 GMT

అవినీతిని అంతమొందించే దిశగా యోగీ అదిత్యనాథ్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. గ్యాంగ్ స్టర్ లను పని పడుతోంది. క్రిమినల్ రేట్ ను తగ్గించి.. పేదలకు న్యాయం చేసే దిశగా కదులుతోంది. గతంలో ప్రయాగ్ రాజ్ లో హత్యకు గురైన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కు.. చాలా భూములు కబ్జా చేశాడు. అతని మరణం తర్వాత ఆ భూమిని స్వాధీనం చేసుకున్న ఉత్తర్ ప్రదేశ్ గవర్నమెంట్.. ప్రధాని ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చింది. పీఎంఏవై కింద 76 ఇళ్లను కట్టించిన ప్రభుత్వం.. ఇవాళ ఆ ఇళ్ల తాళాలను లబ్ధిదారులకు అందించింది.




 


41 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కట్టిన ఈ ఫ్లాట్లను.. పేదల కోసం కేవలం రూ.3.5 లక్షలకే అందిస్తున్నారు. రెండు గదులు, కిచెన్, టాయిలెట్ సౌకర్యాలతో కూడిన ఈ ఫ్లాట్ సొంతగా నిర్మించాలంటే దాదాపు రూ. 6 లక్షల ఖర్చు అవుతుంది. 1731 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కబ్జా స్థలాన్ని జప్తు చేసుకుని.. 2021 డిసెంబర్ 26న సీఎం యోగి చేతుల మీదుగా ప్లాట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం రెండు బ్లాకుల్లో 76 ప్లాట్లను నిర్మించారు.




Tags:    

Similar News