కూతురి పెళ్లి కోసం బ్యాంక్ లాకర్లో ఓ మహిళ దాచిపెట్టిన రూ.18లక్షలను చెదలు తినేశాయి. దీంతో మహిళ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. లాకర్లో దాచిపెట్టిన రూ.18లక్షలు.. నల్లని మట్టిగా మారిపోవడం ఒక్కసారిగా షాకైంది. వెంటనే బ్యాంక్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసింది.
యూపీలోని మొరాదాబాద్.. రామగంగా విహార్‌లోని ఆషియానా కాలనీలో నివాసం ఉంటున్న అల్కా పాఠక్.. ట్యూషన్ టీచర్ గా పనిచేస్తోంది. ఆమెకు బ్యాంక్ ఆఫ్ బరోడా రామగంగా విహార్ బ్రాంచ్‌లో ఖాతా ఉంది. కొన్నినెలల క్రితం ఇదే బ్యాంక్‌లో ఆమె లాకర్ తీసుకుంది. కూతురి పెళ్లి కోసం ఒక్కొక్క రూపాయి పొదుపు చేసుకుంటూ.. . మొత్తం రూ.18లక్షలతో పాటు విలువైన నగలను లాకర్లో ఉంచింది.
అయితే సెప్టెంబర్ 25వతేదీన కేవైసీ, లాకర్ అగ్రిమెంట్ రెన్యువల్ కోసం అల్కా.. బ్యాంక్‌కు వెళ్లింది. ఆ సమయంలో లాకర్‌ను తెరిచిన అల్కా.. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. డబ్బు నోట్లన్నింటినీ చెదలు తినేసి ఉండడం గమనించింది. వెంటనే బ్యాంక్ మేనేజర్‌కు విషయాన్ని చేరవేసింది. ఆయన వచ్చి చూడగా.. చెద పురుగుల తినేయడంతో నోట్లన్ని నల్లని మట్టి, ముక్కలుగా పడి ఉన్నాయి. అయితే నగలు భద్రంగానే ఉన్నట్లు బ్యాంక్ మేనేజర్ తెలిపారు. కేసును విచారిస్తున్నట్లు చెప్పారు. బ్యాంక్ లాకర్లో డబ్బులు పెట్టకూడదని విషయం తనకు తెలియదని అల్కా చెప్పింది.