వాహనదారుకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్లు రద్దు

Update: 2023-06-10 08:05 GMT

తెలిసీ తెలియక చేసిన తప్పులకు ట్రాఫిక్ చలాన్ పడటం కామన్. అయితే ఆ ఫైన్లు కట్టలేక ఇబ్బందిపడేవారెంటరో. కొన్నిసార్లు బండి రేటు కన్నా ట్రాఫిక్ చలాన్ల రూపంలో చెల్లించాల్సిన మొత్తమే ఎక్కువ కావడంతో వాహనాలను రోడ్డుపై వదిలి వెళ్లిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత

5 ఏండ్ల ట్రాఫిక్ చలాన్లు రద్దు చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2017 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు యూపీలోని అన్ని జిల్లాల్లో నమోదైన ట్రాఫిక్ చలాన్లను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. ఈ కాలంలో చలాన్లు నమోదై.. కోర్టులో కేసులు ఉన్న వాహనాలపై కూడా చాలాన్స్ రద్దు కానున్నాయి. ఈ మేరకు యూపీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ చంద్ర భూషణ్ సింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కోర్టుల నుంచి కేసుల లిస్టు రాగానే అధిాకరులు పోర్టల్ నుండి చలాన్లు తొలగించనున్నారు. యోగీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టూవీలర్స్, కార్లు, ప్రైవేట్, కమర్షియల్ వెహికల్స్ కు వర్తించనుంది. చలాన్ల రద్దుతో కమర్షియల్ వాహనదారులకు ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. చలాన్లు అన్నీ రద్దయ్యాక వాహనదారుల ఫోన్ నంబర్స్కు మెసేజ్ రానుంది. ఇటీవల నోయిడాలో రైతులు ట్రాఫిక్ చలాన్లు రద్దు చేయాలని రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే యోగీ సర్కారు 5 ఏళ్ల ట్రాఫిక్ చలాన్లు రద్దు చేయడం విశేషం.


Tags:    

Similar News