మరో 10 రోజుల్లో పెళ్లి.. 10 మంది కలసి యువతిని కిడ్నాప్

Update: 2023-06-07 02:27 GMT

పది రోజుల్లో ఆ యువతి పెళ్లి. పెళ్లి ఏర్పాట్లతో కుటుంబమంతా బిజిబిజీగా గడుపుతోంది. ఇంతలోనే 10 మంది దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. రాజస్థాన్​లోని జైసల్మేర్​లో ఈ దారుణం జరిగింది. కిడ్నాప్ చేసిన అనంతరం.. నిందితుల్లో ఒకడు ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు యత్నించాడు. సప్తపది పేరుతో ఏదో మంట పెట్టి.. ఆ మంట చుట్టూ ఆ యువతిని ఎత్తుకొని ప్రదిక్షణలు చేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. జైసల్మేర్​కు చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన యువకుడితో జూన్​ 12 వివాహం జరగాల్సి ఉంది. అయితే జూన్​ 1వ తేదీన పుష్రేంద్ర, అతని అనుచరులు కలిసి ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం ఎడారిలోకి తీసుకెళ్లి.. యువతిని చేతులతో ఎత్తుకుని మంట చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశాడు. పాపం ఆ యువతి ఏడుస్తున్నా .. పట్టించుకోకుండా ఆమెను చేతితో ఎత్తుకుని గడ్డితో వేసిన మంట చుట్టూ ఏడు సార్లు తిరిగాడు. తనను మరో యువకుడితో పెళ్లి చేసుకోవద్దని కూడా నిందితుడు పుష్పేంద్ర బెదిరించినట్లు తెలుస్తోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితులను అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ స్వాతి మలివాల్​ సైతం స్పందించారు. మరోవైపు.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్​.. అధికారులను ఆదేశించారు.




Tags:    

Similar News