Vijayashanthi : ఆ నమ్మకం ఇప్పుడిప్పుడే ప్రజల్లో కలుగుతోంది : విజయశాంతి
By : Krishna
Update: 2023-12-18 06:25 GMT
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగిన విధానంపై కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి మొదటిసారి అసెంబ్లీ విధానపరంగా జరుగుతోందని అన్నారు. సుమారు దశాబ్దపు పరిపాలన తర్వాత సచివాలయం పూర్తిస్థాయిలో పనిచేస్తోందని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజాస్వామ్య పంథాల నడుస్తుందన్న నమ్మకం కోట్లాది ప్రజలకు ఇప్పుడిప్పుడే ఏర్పడుతోంది. ‘‘కాలం తెలంగాణ ప్రజలకు మేలు చూపాలి.. భవిష్యత్ ఈ భూమి బిడ్డలకు ఎన్నటికీ మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా’’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.