విజృభిస్తున్న విషజ్వరాలు.. ఒక్క రోజే 13వేల మంది హాస్పిటల్ పాలు

Update: 2023-06-20 13:50 GMT



వర్షాలు మొదలవకముందే ప్రజలు విష జ్వరాలతో హాస్పిటల్ కు క్యూ కడుతున్నారు. కేరళ రాష్ట్రంలో గత పది రోజులుగా విష జ్వరాలు ఎక్కువవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 13వేల మంది విష జ్వరాలతో హాస్పిటల్ పాలయ్యారు. జూన్ నెల నుంచే రాష్ట్రంలో విష జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. దాంతో సోమవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1, 61, 346 మంది హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నారు.

ఈ కేసుల్లో డెంగీ, మెదడు వాపు కేసులు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఒక్క సోమవారం రోజే 110 డెంగీ కేసులు, 218 డెంగీ లక్షణాలతో ఉన్న కేసులు హాస్పిటల్ కు వచ్చాయి. అత్యధికంగా ఎర్నాకులం జిల్లా నుంచే డెంగీ (1,011) కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 76 మందికి మెదడు వాపు సోకగా.. 116 మందికి లక్షణాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కేసులు పెరగడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. హాస్పిటల్స్ లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసింది. వైరస్ ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంది.




Tags:    

Similar News