Ayodhya Ram Mandir : అయోధ్య, మోదీపై మొన్న విమర్శలు.. ఇవాళ పొగడ్తలు..
మరికొన్ని గంటల్లో హిందూధర్మంలో సువర్ణాక్షరాలతో సరికొత్త అధ్యాయం లిఖితం కానుంది. ఇవాళ అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. మధ్యాహ్నం 12.20 నుంచి 1వరకు ఈ క్రతువు నిర్వహించనున్నారు. దీంతో దేశం మొత్తం రామనామ స్మరణతో మార్మోగుతోంది. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం హిందువులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఆలయం పూర్తికాకముందే రాముని ప్రాణ ప్రతిష్ఠ ఏంటీ అంటూ ప్రదాని మోదీపై జ్యోతిష్ పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ఇంతకుముందు విమర్శించారు. తాజాగా ఆయన మాటా మార్చారు.
మోదీ ఆరాధకుల్లో తాను ఒకడినని శంకరాచార్య తెలిపారు. మోదీలా హిందుత్వాన్ని బలపేతం చేసిన మరో ప్రధాని ఉంటే చెప్పాలన్నారు. తాము ప్రధానికి వ్యతిరేకులం కాదని.. ఎన్నోసార్లు ఈ విషయాన్ని చెప్పినట్లు వివరించారు. గతంలో మోదీ తీసుకొచ్చిన 370 ఆర్టికల్ రద్దు, స్వచ్ఛత అభియాన్, పౌరసత్వ చట్ట సవరణ వంటి వాటిని అడ్డుకున్నామా అని ప్రశ్నించారు. దేశంలో హిందువులు బలపడినప్పుడల్లా ఎంతో ఆనందించాం.. ప్రస్తుతం మోదీ సైతం అదే చేస్తున్నారు. దీనికి ఎంతో సంతోషిస్తున్నాం అని శంకరాచార్య అన్నారు.