ఆందోళనపై రెజ్లర్ల అనూహ్య నిర్ణయం.. ఇకపై

Update: 2023-06-26 06:33 GMT

రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఎపిసోడ్ లో రెజ్లర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళా రెజర్లు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చిన రెజ్లర్లు.. తాజాగా కీలక ప్రకటన చేశారు. ఇకపై తాము వీధి పోరాటాలు చేయబోమని.. న్యాయస్థానంలో పోరాడతామని ప్రకటించారు. బ్రిజ్ భూషణ్పై చార్జిషీట్ దాఖలు చేస్తామని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని రెజ్లర్లు తెలిపారు




 

‘‘ఈ కేసులో న్యాయం జరిగే వరకు రెజ్లర్ల నిరసన కొనసాగుతుంది.. అయితే అది ఇకపై కోర్టులో ఉంటుంది. డబ్ల్యూఎఫ్ఐలో సంస్కరణలకు సంబంధించి ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 11న జరిగే ఎన్నికల కోసం ఎదురచూస్తున్నాం’’అని సాక్షి మలిక్, వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియాలు ఒకే విధంగా ట్వీట్ చేయడం గమనార్హం. ఈ పోస్ట్ చేసిన చేసిన కొద్ది సేపటికే తాము సోషల్ మీడియా నుంచి విరామం తీసుకుంటున్నట్టు వినేశా ఫోగట్, సాక్షి మలిక్ ట్వీట్ చేశారు.

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు ఇటీవల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రెజ్లర్లు తమ పోరాటం కోర్టులో సాగుతుందని ప్రకటించడం గమనార్హం. అయితే తనపై వచ్చిన ఆరోపణలను బ్రిజ్ భూషణ్ శరణ్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. ఒకవేళ ఈ ఆరోపణలు రుజువైతే ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.



Tags:    

Similar News