White Paper vs Black Paper : పార్లమెంట్‌ వేదికగా వైట్‌ పేపర్‌ Vs బ్లాక్‌ పేపర్‌.. అసలేంటీ ఫైట్..?

Byline :  Bharath
Update: 2024-02-08 06:59 GMT

పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాల వైఖరిని ఎండగడుతుంటే.. ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతున్నాయి. దీంతో పార్లమెంట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వైట్, బ్లాక్ పేపర్ల వార్ మొదలైంది. ఇవాళ జరిగే సమావేశాల్లో.. దేశ ఆర్థిక స్థితిగతులపై అధికార, విపక్ష పార్టీలు వైట్‌, బ్లాక్‌ పేపర్లను సమర్పించేందుకు సిద్ధమయ్యాయి. పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి గురించి బీజేపీ ప్రభుత్వం వైట్ పేపర్ ప్రవేశపెడుతుంటే.. బీజేపీకి పోటీగా ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా బరిలోకి దిగింది.

బీజేపీ శ్వేతపత్రంలో 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాధించిన విజయాలపై జాబితా రూపొందించింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ సందర్భంగా ఈ శ్వేతపత్రాన్ని సమర్పించనున్నారు. 2014 కు ముందు, ఆ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి మధ్య తేడాను చెప్పే ఉద్దేశంతో ఈ శ్వేతపత్రాన్ని పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. దాని ద్వారా గత పాలకుల లోపాలను ఎత్తిచూపేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది.

బీజేపీ శ్వేతపత్రాన్ని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ బ్లాక్ పేపర్ ను సిద్ధం చేసింది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ బ్లాక్ పేపర్ ను సభ ముందుకు తీసుకెళ్తారు. పదేళ్లలో మోదీ పాలన వైఫల్యాలు ఎత్తిచూపే ఉద్దేశంతో బ్యాక్ పేపర్ ను పార్లమెంట్ ఉభయ సభల ముందుకు తీసుకురానున్నారు. బీజేపీ హయాంలో పెరిగిన ధరలు, నిరుద్యోగం తదితర అంశాలను బ్లాక్ పేపర్ లో వివరించనున్నట్లు తెలుస్తుంది. కాగా వైట్, బ్లార్ పేపర్లు ప్రవేశపెట్టడం వల్ల పార్లమెంట్ ఉభయసభలు వాడీవేడీగా సాగే అవకాశం ఉంది. 

Tags:    

Similar News