భార్య నల్లగా ఉందని.. కరెంట్ షాక్తో భర్త..

Byline :  Mic Tv Desk
By :  Krishna
Update: 2023-08-30 03:45 GMT

ప్రస్తుత ఆధునిక యుగంలో భార్యాభర్తల బంధం బీటలు వారుతోంది. చిన్న చిన్న కారణాలతో విడిపోవడం, కలహాలతో చంపుకోవడం వంటివి ఎక్కువయ్యాయి. తాజాగా భార్య నల్లగా ఉందని ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. జీవితాంతం తోడుగా నమ్మించిన వ్యక్తే.. ఆమె పాలిట కాలయముడయ్యాడు. నల్లగా ఉందని భార్యకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు. ఈ దారుణ ఘటన బీహార్లో జరిగింది.

తూర్పు చంపారన్ జిల్లా సంగ్రామ్పూర్ పురందర్పూర్ గ్రామానికి చెందిన శ్యామ్ లాల్ షా, ప్రియాంక దేవి భార్యభర్తలు. శ్యామ్ లాల్ షా ఐస్ ఫ్యాక్టరీలో పని చేస్తాడు. ప్రియాంక నల్లగా ఉండడంతో శ్యామ్కు నచ్చేది కాదు. నల్లగా ఉన్నావు, నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నా అంటూ నిత్యం భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఎన్నోసార్లు గొడవలు అయినట్లు తెలుస్తోంది. సోమవారం కూడా ఇద్దరి గొడవ జరగ్గా.. శ్యామ్ లాల్ సహనం కోల్పోయాడు. ఆవేశంలో భార్యకు కరెంట్ షాక్ ఇవ్వడడంతో ఆమె స్పాట్లోనే చనిపోయింది.

ఆ తర్వాత మృతదేహాన్ని ఐస్ బాక్స్లో దాచాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. శ్యామ్ లాల్ను అరెస్ట్ చేశారు. ఐస్ బాక్స్ నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ క్రమంలో శ్యామ్ లాల్ను కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంక నల్లగా ఉంటే పెళ్లి ఎందుకు చేసుకున్నాడని.. పెళ్లి చేసుకుని నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడని వాపోతున్నారు.

Tags:    

Similar News