కాసేపట్లో ఈడీ విచారణ.. కేజ్రీవాల్ హాజరుపై సస్పెన్స్..

By :  Krishna
Update: 2024-02-19 03:57 GMT

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను విచారించేందుకు ఈడీ సిద్ధమైంది. లిక్కర్ స్కాం కేసులో ఇవాళ విచారణకు హాజరుకావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈడీ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేయడం ఇది ఆరోసారి. గతంలో 5సార్లు నోటీసులు జారీ చేయగా.. ఆయన విచారణకు హాజరుకాలేదు. ఇవాళ్టి విచారణకు ఆయన హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని ఇప్పటికే ఈడీ కోర్టును ఆశ్రయించడంతో.. కేజ్రీవాల్ కోర్టు విచారణకు హాజరయ్యారు.

\ఈ నెల 17న వర్చువల్గా కేజ్రీవాల్ కోర్టు విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. మార్చి 16న కేజ్రీవాల్ స్వయంగా కోర్టుకు హాజరుకానున్నారు. కాగా లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈడీ గతేడాది నవంబర్‌ 2న తొలిసారిగా సీఎం కేజ్రీవాల్‌కు నోటీసులు జారీచేసింది. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈడీ అధికారులు డిసెంబర్‌ 21న రెండోసారి నోటీసులు పంపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ఉందన్న కారణంతో 10 రోజులపాటు విపాసన మెడిటేషన్‌ క్యాంప్‌నకు వెళ్లారు. ఈ క్రమంలో జనవరి 3న విచారణకు రావాలంటూ ఆప్‌ అధినేతకు మూడోసారి నోటీసులు పంపించింది. అయితే దానికి కూడా సీఎం కేజ్రీవాల్‌ దూరంగా ఉన్నారు. జనవరి 18న 4వ సారి, జనవరి 31న ఐదోసారి నోటీసులు జారీ చేసింది. అయినా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు.

Tags:    

Similar News