మంచు లక్ష్మి..ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. తండ్రి మోహన్ బాబు నట వారసత్వాన్ని ఒంట బట్టించుకొని సినీ పరిశ్రమలో రాణిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. అదే విధంగా లేటెస్ట్ ఇష్యూస్‌పై తనదైన శైలిలో స్పందిస్తూ సోషల్ యాక్టివిస్ట్‌గా చురుకుగా ఉంటుంది లక్ష్మి. తన పర్సనల్ విషయాలతో పాటు, ప్రొఫెషనల్ సంగతులను నెట్టింట్లో పంచుకోవటమే కాకుండా, రకరకాల ఫోటో షూట్లతో, అప్పుడప్పుడు రాజకీయాలపై రియాక్ట్ అవుతూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్‌గా ఉంటుంది. అయితే తాజాగా మంచు లక్ష్మికి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లక్ష్మికి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోందన్న టాక్ జోరుగా వినిపిస్తోంది.
మంచు లక్ష్మి పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయ్యిందా? ఆమె ఎంట్రీకి గ్రౌండ్ వర్క్ ముందుగానే సిద్ధం చేసుకుందా? పీఎం ఆఫీస్ నుంచి కాల్ అందుకే ? కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమేనా? అంటే అవుననే అనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే. మంచు లక్ష్మిని కేంద్ర పార్టీ బీజేపీ పిలిచినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్ రావడంతో ఇవాళ మంచు లక్ష్మీ ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం. దీంతో ఆమెను పార్టీలో చేర్చుకునేందుకే ఈ కాల్ అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ కొత్త ప్లాన్ వేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే బీజేపీలో మంచు లక్ష్మి చేరికపై ఇరు పక్షాల నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో మహిళా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్నఫేమస్ మహిళలను పిలిపించి మహిళా బిల్లుపై మాట్లాడతారని, అందులో భాగంగా మంచు లక్ష్మికి కాల్ వచ్చి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా మంచు లక్ష్మికి ఇలా పీఎం ఆఫీస్ నుంచి కాల్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.