కొత్తగా పెళ్లైంది. అత్తగారింట్లో అడుగుపెట్టినప్పటి నుంచి పనులేమీ చేయకుండా ఫోన్తోనే కాలం వెళ్లదీస్తోంది. కొన్నాళ్లు భరించిన అత్తమామలు ఓ రోజు గట్టిగా మందలించారు. ఫోన్ చూడటం మానుకొని బాధ్యతగా మెలగాలని చెప్పారు. అత్తమామలు చెప్పిన మాటలతో హర్ట్ అయిన ఆ కోడలు పుట్టింటికి వెళ్లింది. భర్తతో విడాకులకు సిద్ధమైంది.
బీహార్‌లోని హాజీపూర్‌కు చెందిన ఇలియాస్ అనే వ్యక్తికి సాబా ఖతూన్ అనే అమ్మాయితో ఇటీవలే పెళ్లైంది. అత్తగారింట్లో అడుగుపెట్టిన సాబా నిత్యం ఫోన్లో ఇన్స్టాగ్రాం రీల్స్ చూస్తూ ఫేస్ బుక్ లో లైకులు కొడుతూ కాలం వెళ్లదీసేది. రోజులు గడుస్తున్నా కోడలు బాధ్యత లేకుండా ఫోన్ లో గడుపుతున్న కోడలిని అత్తమామలు మందలించాడు. భర్త కూడా సీరియస్ అయ్యాడు. దీంతో తన సోదరుడికి ఫోన్ చేసిన సాబా జరిగిన విషయమంతా చెప్పింది.
సోదరి చెప్పిన విషయం విని తీవ్ర ఆగ్రహావేశాలకులోనైన సాబా సోదరుడు చెల్లి ఇంటికి వచ్చి బావ ఇలియాస్ను తుపాకీతో భయపెట్టాడు. దీంతో అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫోన్ చేశారు. ఇలియాస్ ఇంటికి వచ్చిన పోలీసులు సాబా సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో సాబా తనను ఫోన్ చూడనివ్వని భర్త, అత్తమామలతో ఉండలేనని తెగేసి చెప్పింది. మొగుడికి విడాకులిస్తానంటూ అత్తగారింటిని నుంచి పుట్టింటికి వెళ్లిపోయింది.