చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఎట్టకేలకూ లోక్ సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును సభ ముందుంచారు. ఈ బిల్లుకు ‘నారీ శక్తి వందన్’గా నామకరణం చేశారు. సెప్టెంబరు 20న ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగనుంది. చర్చ పూర్తైన అనంతరం ఓటింగ్ నిర్వహించి బిల్లుకు సభ ఆమోదముద్ర వేయనున్నారు. రాజ్యసభలో ఈ బిల్లును సెప్టెంబరు 21వ తేదీన ప్రవేశపెట్టనున్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ల అమలు ఉంటుందని కేంద్ర మంత్రి చెప్పారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 239AA సవరించడం ద్వారా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ.. NCTలో, ఆర్టికల్ 330A సవరణతో ఎస్సీ, ఎస్టీలకు ప్రజా ప్రతినిధుల సభలో 33శాతం మహిళా రిజర్వేషన్ కోటా అమలు చేయనున్నట్లు కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు.
తాజా బిల్లు 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మహిళా కోటాపై కేంద్రం కొత్తగా మరో రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొస్తున్నట్లు చెప్పింది. ఈ కారణంగానే తాజా బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారితే.. లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి.
#WATCH | In the Lok Sabha of the new Parliament building, Union Law Minister Arjun Ram Meghwal says "This bill is in relation to women empowerment. By amending Article 239AA of the Constitution, 33% of seats will be reserved for women in the National Capital Territory (NCT) of… pic.twitter.com/BpOMzt1ydW
— ANI (@ANI) September 19, 2023