Vinesh Phogat : అవార్డులను వెనక్కి ఇచ్చేసిన వినోశ్‌ ఫోగట్‌

Byline :  Veerendra Prasad
Update: 2023-12-31 03:08 GMT

భారత స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌ తనకు వచ్చిన జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజగా ఆమె ఆ అవార్డులను తిరిగి ఇచ్చేసింది. దిల్లీలోని కర్తవ్య పథ్ పేవ్‌మెంట్‌పై శనివారం తన అర్జున, ఖేల్ రత్న అవార్డులను ఆమె వదిలిపెట్టి వచ్చింది. అయితే తొలుత ఆమె ప్రధాన మంత్రి కార్యాలయం ఎదుట వదిలేయడానికి ప్రయత్నించింది. కానీ ఆమెను కర్తవ్య పథ్ వద్ద పోలీసులు అడ్డగించారు. దీంతో తన అవార్డులను కర్తవ్య పథ్ వద్ద పేవ్‌మెంట్‌పై వదిలేసింది. అనంతరం ఆ పతకాలను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.





 


 

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎ్‌ఫఐ) కొత్త అధ్యక్షుడిగా బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ సన్నిహితుడు సంజయ్‌ సింగ్‌ ఎన్నిక కావడాన్ని నిరసిస్తూ..తన ఖేల్‌రత్న, అర్జున పురస్కారాలను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చివేయనున్నట్టు ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత వినేశ్‌ కొద్దిరోజల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే సంజయ్‌ సింగ్‌ ఎన్నికను నిరసిస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఈనెల 22నే ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌ రెజ్లింగ్‌ క్రీడ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించగా.. ఇటీవలే టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత బజ్‌రంగ్‌ పూనియా తన పద్మశ్రీ అవార్డును కర్తవ్యపథ్‌ మార్గంలోనే వదిలి వెళ్లాడు. ఇక, బధిర ఒలింపిక్స్‌ మాజీ చాంపియన్‌ వీరేందర్‌ కూడా తన పద్మశ్రీని తిరిగి ఇచ్చి వేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు. కాగా..‘కేంద్ర ప్రభుత్వ ప్రకటనలలో పేర్కొన్నట్టుగా దేశ మహిళల సాధికారిత, అభ్యున్నతి లేదు’ అని ఎక్స్‌లో వినేశ్‌ ఫొగట్‌ పోస్ట్‌ చేసింది.

ఇటీవలే ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన ఓ లేఖలో తన అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు పేర్కొంది. "నేను నా మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న, అలాగే అర్జున అవార్డును తిరిగి ఇస్తున్నాను" అంటూ క్యాప్షన్​ను జోడించింది. ఇటీవల జరిగిన భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్ష ఎన్నికల్లో సంజయ్‌ సింగ్‌ గెలుపొందగా.. దీనికి నిరసనగా రెజ్లర్లు తిరిగి పోరుబాట పట్టారు. గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్‌భూషణ్‌ కనుసన్నల్లోనే తిరిగి డబ్ల్యూఎఫ్‌ఐ నడుస్తున్నదనే ఆవేదనతో మల్లయోధులు అవార్డులు వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు




Tags:    

Similar News