కేంద్రానికి రెజర్ల్స్ అల్టిమేటం.. సమస్యలు పరిష్కారమైతేనే ఏషియన్ గేమ్స్‌కు..
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకునేంత వరకు భారత్ రెజ్లర్స్ పట్టు వీడేలా కనిపించడం లేదు. తాజాగా కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. ఆసియా క్రీడల్లో పాల్గొనాలంటే..తమ సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించిన తర్వాతే నే ఏషియన్ గేమ్స్ వెళ్తామని సాక్షి మాలిక్ హెచ్చరించారు.
హరియాణాలోని సోనిపట్‌లో శనివారం జరిగిన ఖాప్ నేతల సమావేశాంలో సాక్షి మాలిక్, బజరంగ్ పునియా పాల్గొన్నారు. ప్రభుత్వంలో జరిగిన చర్చల గురించి ఖాప్ నేతలకు వివరించారు. ఆందోళన చేస్తున్న రెజ్లర్ల మధ్య ఐక్యత లోపించిందంటూ వస్తున్న వార్తలను వారు కొట్టిపారేశారు. తామంతా ఒక్కటే అని తెలిపారు. సమావేశం అనంతరం సాక్షి మాలిక్ మాట్లాడుతూ " ప్రతిరోజూ మానసికంగా ఎంతటి వేదన అనుభవిస్తున్నామో మీకు అర్థం కాదు .సమస్యలన్నీ పరిష్కారమైతేనే మేం ఏషియన్ గేమ్స్‌లో పాల్గొంటాం" అని తెలిపారు.
బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు కేంద్రం ఇచ్చిన హామీతో తాత్కాలికంగా విరామం ప్రకటించారు. బ్రిజ్ భూషణ్‌పై ఈ నెల 15 లోగా ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని, జూన్ 30 లోగా డబ్ల్యూఎఫ్‌ఐకి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో కాస్త వెనక్కు తగ్గారు. గడువులోపు చర్యలు చేపట్టకపోతే మళ్లీ ఆందోలన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఆయన ఇంటి వద్దకు ఓ మహిళా రెజ్లర్‌ను తీసుకెళ్లి సీన్ రీక్రియేషన్ చేయించారు.
#WATCH | "We will participate in Asian Games only when all these issues will be resolved. You can't understand what we're going through mentally each day": Wrestler Sakshee Malikkh in Sonipat pic.twitter.com/yozpRnYQG9
— ANI (@ANI) June 10, 2023