భారత్‌కు వస్తున్న 'గెలాక్సీ లీడర్‌' హైజాక్

Byline :  Veerendra Prasad
Update: 2023-11-20 02:32 GMT

టర్కీ నుంచి భారత్‌కు బయలుదేరిన కార్గో షిప్‌ను ఎర్ర సముద్రంలో యెమన్‌ దేశానికి చెందిన హౌతీ మిలిటెంట్లు హైజాక్ చేశారు. ఇందులో ఉక్రెనియన్, బల్గేరియన్, ఫిలిపినో, మెక్సికన్‌ దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. హైజాక్ విషయాన్ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ట్వీట్ చేసింది. ఇజ్రాయెలీ నౌకను తామే హైజాక్ చేశామని హౌతీలు ప్రకటించారు.

భారతీయులూ లేరని ధ్రువీకరించింది. గెలాక్సీ లీడర్‌ అనే ఈ నౌకను హైజాక్‌ చేయడాన్ని ప్రధాని కార్యాలయం ఖండించింది. ఇరానియన్‌ తీవ్రవాద చర్యగా అభివర్ణించింది.

గెలాక్సీ లీడర్‌ అనే ఈ నౌకను హైజాక్‌ చేయడాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఖండించింది. ఇరానియన్‌ తీవ్రవాద చర్యగా అభివర్ణించింది. ఇరాన్ ఇచ్చిన గైడెన్స్ ప్రకారమే ఈ నౌకను హౌతీలు హైజాక్ చేశారని ఆరోపించింది. అంతర్జాతీయ సంక్షోభానికి దారితీసే తీవ్ర చర్యగా పేర్కొంది. బ్రిటీష్ కంపెనీకి చెందిన ఆ నౌకను ఒక జపాన్ సంస్థ లీజుపై నిర్వహిస్తోందని తెలిపింది. ఈ నౌక బ్రిటీష్ కంపెనీ కింద రిజిస్టర్ చేయబడిందని, దీంట్లో ఇజ్రాయిల్ వ్యాపారవేత్త అబ్రహం ఉంగార్‌కి పాక్షికంగా యాజమాన్యం(పబ్లిక్‌ డొమైన్‌ లో) ఉందని, హైజాక్ సమయంలో ఈ నౌకను జపాన్ కంపెనీకి లీజుకు ఇచ్చారని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ నివేదించింది. హైజాక్ చేసిన ఓడను యెమన్ తీరంలోని ఓడరేవు నగరం సలీఫ్‌కు తీసుకెళ్లారంటూ ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది.

ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ మిలిటెంట్లు ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో హమాస్‌కి సపోర్ట్ చేస్తోంది. ఇజ్రాయిల్ తో సంబంధం ఉన్న నౌకల్ని లక్ష్యంగా చేసుకుంటామని ఇప్పటికే ప్రకటించింది. ఇజ్రాయిల్ దాడులు ఆగిపోయే వరకు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తామని ఇటీవల హౌతీలు ప్రకటన చేశారు.




Tags:    

Similar News