బాబా రామ్‌దేవ్ సరికొత్త అవతార్..రేంజ్ రోవర్లో రయ్ రయ్
యోగా గురు, పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబా సరికొత్త అవతారంలో సదండి చేస్తున్నారు. లగ్జరీ కార్లో రయ్ రయ్ మంటూ తిరుగుతూ అందరిని ఆకర్షిస్తున్నారు. దాదాపు 1.5 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ రోవర్ కారును బాబా డ్రైవ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాబాకు ఇంతటి కాస్ట్లీ కారా అంటూ నెటిజన్స్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. దీంతో మరోసారి బాబా లగ్జరీకార్ల కలెక్షన్స్, పతంజలి గురించి నెట్టింట్లో పెద్ద చర్చ జరుగుతోంది.
బాబా మహీంద్రా నుంచి ల్యాండ్ రోవర్ కి ప్రమోట్ అయ్యారంటూ నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు బాబా భారతీయ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ విదేశీ ప్రాడక్ట్స్ ను ఎన్నుకుంటున్నారని మండి పడుతున్నారు.
నిత్యం యోగా ప్రోగ్రామ్స్‌తో , పతంజలి బిజినెస్ పనులతో విరామం లేకుండా ఉండే రామ్ దేవ్ బాబా తాజాగా ల్యాండ్ రోవర్ కారు నడుపుతూ కనిపించారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో బాబా ఒక్కసారిగా ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 ఎస్‌యూవీ వాహనాన్ని నడుపుతూ అందరిని అవాక్కు చేశారు. వాస్తవానికి బాబా ఇప్పటి వరకు ఎప్పుడూ కారును నడిపింది లేదు. అలాంటిది ఒక్కసారిగా ల్యాండ్ రోవర్ నడుపుతూ కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అది కూడా సరదాగా కాసేపు తిరిగేందుకు ఆయన స్టీరింగ్ పట్టినట్లు తెలుస్తోంది. కారుకు నెంబర్ ప్లేట్ కూడా లేకపోవడంతో ఆయన కొత్తగా కారు కొనుగోలు చేశారని నెటిజన్లు భావిస్తున్నారు. రూ.1.5 కోట్ల విలువైన ఈ లగ్జరీ కారును బాబానే స్వయంగా కొనుక్కున్నారా? లేదా తెలిసిన వారి వాహనాన్నికాసేపు డ్రైవ్ చేశారా? అన్న దానిపై ఎలాంటి క్లారిటీ లేదు.