యాడ్ బ్లాకర్ వాడే వాళ్లకు.. యూట్యూబ్ హెచ్చరిక

Update: 2023-06-30 15:38 GMT

ఈ మధ్య చిన్నా పెద్దా.. అనే తేడా లేకుండా యూట్యూబ్ కు అలవాటు పడిపోయారు. గంటల తరబడి.. రీల్స్, వీడియోలు చూస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న యూట్యూబ్.. యాడ్స్ పెంచేసింది. ఆ యాడ్స్ రాకుండా ఉండేందుకు ఈ మధ్య చాలామంది యాడ్ బ్లాకర్ వాడుతున్నారు. అలా.. వీడియోల మధ్య యాడ్స్ రాకుండా యాడ్ బ్లాకర్ వాడుతున్న వాళ్లకు యూట్యూబ్ హెచ్చరికలు జారీ చేస్తోంది..

అలాంటి వాళ్లకు యూట్యూబ్ ఈ మధ్య ఓ వార్నింగ్ నోటిఫికేషన్ పంపడం మొదలుపెట్టింది. యాడ్ బ్లాకర్ డిజేబుల్ చేయకపోతే.. మూడు వీడియోల తర్వాత, మీ యూట్యూబ్ అకౌంట్ ను బ్లాక్ చేస్తామని ఆ నోటిఫికేషన్ ద్వారా హెచ్చరిస్తోంది. యాడ్స్ వద్దనుకుంటే ప్రీమియంకు సబ్ స్క్రైబ్ కావాలని కోరింది. యూట్యూబ్ పై అధారపడి ఎంతోమంది క్రియేటర్లు ఉన్నారని, యాడ్స్ ద్వారా వచ్చే సొమ్మే వాళ్లకు ఆధారమని పేర్కొంది.




Tags:    

Similar News