తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతోన్నాయి. ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు, జడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలను బదిలీ చేసిన రేవంత్ సర్కార్ తాజాగా అడిషనల్ ఎస్పీలను బదిలీ చేసింది. 12మంది అడిషనల్ ఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ట్రాఫిక్-3 డీసీపీగా రామారావు, సైబర్ క్రైమ్ అడిషనల్ డీసీపీ - శ్రీనివాసులు బదిలీ అయ్యారు. నిజామాబాద్ అడిషనల్ ఎస్పీగా ఎస్ రమేశ్, ఆదిలాబాద్ - సురేందర్ రావు, మెదక్ - రెహ్మాన్, నిర్మల్ అదనపు ఎస్పీగా శివకుమార్ సహా పలువురు అడిషనల్ ఎస్పీలు ట్రాన్స్ఫర్ అయ్యారు.