హైదరాబాద్: KPHB అడ్డగుట్టలో విషాదం.. ఇద్దరు మృతి

Update: 2023-09-07 05:11 GMT

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలోని అడ్డగుట్ట కాలనీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అనూహ్య ఘటనతో ఉలిక్కపడ్డ స్థానిక ప్రజలు.. మొదట భారీ వర్షాల నేపథ్యంలోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావించారు. పోలీసులకు సమాచారం అందించగానే.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.

నిర్మాణంలో ఉన్న భవనం ఆరవ అంతస్తు పైనుంచి పడి ఇద్దరు కూలీలు మృతిచెందారు. నిర్మాణంలో ఉన్న భవనం ఆరో అంతస్తు గోడ కూలడంతో సెంట్రింగ్ కర్రలు విరిగాయి. దీంతో నిర్మాణ పనుల్లో ఉన్న కూలీలు కిందపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు ఘటన స్థలంలోనే మృతిచెందారు. మృతులు బీహార్‌కు చెందిన సంతూ బట్నాయక్, సోనియా చరణ్‌లుగా గుర్తించారు పోలీసులు. అయితే ఈ ప్రమాదంలో భవనం లోపలి వైపు పడ్డ మరో ముగ్గురు కూలీల పరిస్థితి కూడా విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.




Tags:    

Similar News