Vikarabad District : ఆధార్‌, పాన్‌ కార్డులు పంచకుండా పడేశారు

Update: 2024-01-21 05:36 GMT

పోస్ట్ మాస్టర్ నిర్లక్ష్యంతో ఆధార్, పాన్‌కార్డులు చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలో చోటుచేసుకుంది. చాలా మంది ప్రజలు వివరాలు అప్‌డేట్ చేసుకున్నా కొత్తగా అప్లై చేసుకున్నా ఆధార్ అందకపోవడంతో పలుమార్లు మండల కేంద్రంగా పని చేస్తున్న పోస్టాఫీసులో ఆరా తీసేవారు. అయితే శనివారం చెత్త సేకరిస్తున్న పంచాయతీ ట్రాక్టరులో కుప్పలు తెప్పలుగా ఆధార్, పాన్‌కార్డులు కనిపించాయి. పోస్ట్ మాస్టర్ 13 ఏళ్లుగా వీటిని ప్రజలకు ఇవ్వకుండా ఇంట్లోనే పెట్టుకుని ఇటీవల చెత్త కుప్పలో పడేశాడు.

దీంతో స్థానికులు వాటిని సేకరించి, ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని కొంతమంది వీడియో­తీసి సామాజిక మాధ్యమా ల్లో వైరల్‌ చేయగా వీడియోను చూసిన చౌడా పూర్, మక్తవెంకటాపూర్, మందిపల్‌ గ్రామ స్తులు అక్కడకు చేరుకుని వారికి రావాల్సిన కార్డుల్ని తీసుకున్నారు. మిగిలిన ఆధార్, ఏటీఎం, క్రెడిట్‌ కార్డులను చౌడాపూర్‌ తహసీల్దార్‌ ప్రభు వద్ద భద్రపరిచారు. పోస్ట్‌మ్యాన్‌ విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నాడంటూ కొం­త­మంది తహసీల్దార్‌ కార్యాలయం ఎదు­ట ఇటీవలే ఆందోళన చేశారు. తాజా ఘటనతో అతడిపై తగిన చర్యలు తీసుకో­వా­ల్సిందిగా మహబూబ్‌నగర్‌ జిల్లా పోస్టల్‌ అధి­కా­రు­లకు సిఫార్సు చేస్తామని తహసీల్దార్‌ తెలిపారు.




Tags:    

Similar News