Charlapally Station : చర్లపల్లి స్టేషన్ నుంచి రైళ్లు నడిపేందుకు..రైల్వే శాఖ నిర్ణయం

Byline :  Vamshi
Update: 2024-02-17 04:09 GMT

మార్చి మొదటి వారంలో ప్రధాని మోదీ చర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మిన్ జాతికి అంకితం చేయనున్నారు. సికింద్రాబాద్ జంక్షన్‌పై ఒత్తడి తగ్గించేందుకు చర్లపల్లి నుంచి 25 జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించారు. ఈ మార్పులను సంబంధించి ప్రజలందరికి సమాచారం అందేల చర్యలు తీసుకోవాలని అధికారులను రైల్వే బోర్డు ఆదేశించింది. జంటనగరాల్లోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లకు తోడుగా సిద్ధమవుతున్న చర్లపల్లి స్టేషన్ నుంచి పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపాలని సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయించింది. ఇతర స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ దిశగా రైల్వే బోర్డుకు అనుమతులు కోరుతూ లేఖ రాయగా 3 జతల రైళ్లకు సంబంధించి అనుమతులు వచ్చాయి. మరో 6 జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా చర్లపల్లిలో ఆపేందుకు బోర్డు అనుమతించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎంతో పాటు ఇతర జీఎంలకు ఆదేశాలు జారీ చేసింది.

చర్లపల్లి నుంచి ప్రారంభంకానున్న రైళ్లివే..

18045/18046 షాలీమర్‌ - హైదరాబాద్‌ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌

12603/12604 ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌

12589/12590 గోరఖ్‌పూర్‌ - సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌

చర్లపల్లిలో ఆగే రైళ్లు..

17011/17012 హైదరాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌

12757/12758 సికింద్రాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌

17201/17202 గుంటూరు - సికింద్రాబాద్‌ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌

17233/17234 సికింద్రాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌

12713/123714 విజయవాడ - సికింద్రాబాద్‌ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌

12705/12706 గుంటూరు - సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌




Tags:    

Similar News