శంషాబాద్ ఎయిర్పోర్టులో మళ్లీ పట్టుబడ్డ బంగారం.. ఈసారి ఎలా తెచ్చారంటే..?

Byline :  Kiran
Update: 2023-08-29 16:39 GMT

శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. విదేశాల నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు రూ.36 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.




 


మంగళవారం ఓ ప్రయాణికుడు ఇండిగో విమానంలో మస్కట్ నుంచి హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఓ ప్యాసింజర్ పై అనుమానం వచ్చింది. దీంతో పూర్తిస్థాయిలో స్కానింగ్ చేయగా, అతని వద్ద బంగారం ఉన్నట్లు గుర్తించారు. శరీరంలో బంగారం పేస్టును క్యాప్సూల్ రూపంలో దాచి తరలించినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు రూ. 35.69 లక్షల విలువ జేసే 590 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొన్న కస్టమ్స్ సిబ్బంది సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.




Tags:    

Similar News