Covid 19: భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం

Byline :  Veerendra Prasad
Update: 2023-12-25 03:45 GMT

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా చాపకింద నీరులా కరోనా వ్యాప్తి చెందుతోంది. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. అందులో ఒకరు వరంగల్ ఎంజీఎంలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన సుంకరి యాదమ్మ (65)కు మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో.. వరంగల్ ఎంజీఎంలో అడ్మిట్ చేశారు. కుటుంబంలోని మిగతా నలుగురు వారి నివాసంలోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. యాదమ్మ కుటుంబసభ్యులు భాస్కర్ (42), వీణ (30), ఆకాష్ (13), మిద్దిని (5)లు ఇంట్లోనే ఉండి.. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. దీంతో గాంధీనగర్ గ్రామానికి చెందిన ప్రజలు అలర్ట్‌ అయ్యారు. కరోనా పట్ట తగు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు దాదాపుగా 50 ఉన్నాయి.

Tags:    

Similar News