KTR Funny : కేటీఆర్‌ను చూసి ముఖం తిప్పేసిన పాప..మంత్రి డైలాగ్ వింటే నవ్వాల్సిందే

Update: 2023-08-12 11:42 GMT

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేపట్టారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు సైనీ భారత్‌ ఇంటిగ్రేటెడ్‌ హ్యాండ్లూమ్‌ యూనిట్‌ను సందర్శించి నేతన్నలతో కేటీఆర్ ముచ్చటించారు. దీంతోపాటు సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్, ధోబీ ఘాట్, మురుగు నిల్వలు, సీసీ రోడ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. పోచంపల్లి చేనేత పార్క్‌ను పునరుద్ధరించి నేతన్నలకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని కేటీఆర్ వెల్లడించారు.

అంతకుముందు పోచంపల్లిలోని కొన్ని కాలనీలు పర్యటించి స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సరదా సన్నివేశం చోటుచేసుకుంది. కేటీఆర్ వేసిన ఓ డైలాగ్ నవ్వులు పూయించింది. ఓ మహిళ వద్ద ఉన్న చిన్నారిని ఎత్తుకోవడాని కేటీఆర్ అడిగారు. కానీ ఆ చిన్నారి కేటీఆర్ ను చూసి ముఖం తిప్పేసి.. వెళ్లేందుకు నిరాకరించింది. వెంటనే స్పందించిన కేటీఆర్.. 'రా బిడ్డా.. కాంగ్రెసోళ్ల లెక్క లంగలం కాదు మంచోల్లం' అంటూ వ్యాఖ్యనించారు. దీంతో అక్కడి ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Tags:    

Similar News