Ts Parliament Elections : కాంగ్రెస్​లో పెరుగుతున్న డిమాండ్.. కరీంనగర్లో లోకల్, నాన్ లోకల్ వార్

Byline :  Bharath
Update: 2024-02-01 03:25 GMT

(Ts Parliament Elections) లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు మళ్లీ జోరందుకున్నాయి. సీటు కోసం పోటీ పడుతూనే.. ఇతర పార్టీ నేతలపై రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ ఎంపీ నియోజకవర్గ పరిధిలో క్యాంపెయిన్ మొదలైంది. బీజేపీ ఎంపీ టికెట్ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కి ఖరారు చేయగా.. పలుమార్లు మాజీ ఎంపీ బోయిన్ పల్లి వినోద్ కుమార్ ను కరీంనగర్ ఎంపీగా గెలిపించాలని కేసీఆర్, కేటీఆర్లు చెప్పుకొచ్చారు. దీంతో బీఆర్ఎస్ టికెట్ వినోద్ కుమార్ కు ఇస్తారని దాదాపు కన్ఫామ్ అయింది. దీంతో నియోజకవర్గంలో ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు, నేతలతో పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ పార్టీ చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుంటూరు.. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ‘నేను లోకల్.. వినోద్ కుమార్ నాన్ లోకల్’ అంటూ బండి సంజయ్ పొలిటికల్ కామెంట్స్ చేశారు. అది కాస్త రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యేసరికి బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది.




 


అయోధ్య రామమందిరం, కరీంనగర్ స్మార్ట్ సిటీ ఫండ్స్, నేషనల్ హైవే, నియోజకవర్గానికి తీసుకొచ్చిన నిధులను తమ ఎన్నికల క్యాంపెయిన్ లో ప్రధానాశంగా తీసుకొస్తున్నారు. వీటికి బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు, నాన్ లోకల్ సెంటిమెంట్ తోడయింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి స్థానికంగా ఇబ్బందులు తెలెత్తేలా కనిపిస్తుంది. దీనికి బీఆర్ఎస్ నేతలు కౌంటర్ అటాక్ ఇచ్చినా ఫలితం కనిపించట్లేదు. అటు కాంగ్రెస్ పార్టీలో కూడా కరీంనగర్ ఎంపీ సీటుకు ఫుల్ డిమాండ్ ఉంది. దాంతో ఆ సీటు నుంచి ఎవరు పోటీ చేస్తున్నారనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. ప్రస్తుతం బండి సంజయ్ తెచ్చిన లోకల్- నాన్ లోకల్ సెంటిమెంట్ బలపడితే.. కాంగ్రెస్ కూడా అదే ఫాలో అయ్యే అవకాశం ఉంది. కాగా టికెట్ కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేతలంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారే కావడం గమనార్హం. దీంతో ఎవరికి టికెట్ కేటాయిస్తుంది అనేది సస్పెన్స్ గా మారింది.  




 




Tags:    

Similar News