Ayodhya Ram mandir :తెలంగాణ రామ భక్తులకు శుభవార్త.. హైదరాబాద్ నుంచి అయోధ్యకు రైలు.. టైమింగ్స్ ఏంటంటే..?
జనవరి 22న ప్రారంభం కాబోయే అయోధ్య రామమందిరం కోసం యావత్ దేశం ఎదురుచూస్తుంది. ఈ మహత్తర ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు దేశ ప్రజలు చాలామంది అయోధ్యకు తరలివెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పలు ప్రాంతాల నుంచి ఇప్పటికే ప్రత్యేక రైళ్లు, బస్సులు, విమానాలను ఏర్పాటుచేసింది. కాగా తెలంగాణ ప్రజలకు శుభవార్తను చెప్తూ.. హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు ఏర్పాటుచేశారు. ప్రతీ శుక్రవారం ఈ రైలు అందుబాటులో ఉంటుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.
యశ్వంత్ పూర్- గోరఖ్ పూర్ (రైలు నెంబర్ 15024) ఎక్స్ ప్రెస్ రైలు ప్రతీ గురువారం రాత్రి 11: 40 గంటలకు యశ్వంత్ పూర్ లో బయలుదేరుతుంది. శుక్రవారం ఉదయం 10:40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. ఉదయం 10:50 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి కాజీపేట, బలార్షా, నాగ్ పూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో మీదుగా శనివారం సాయంత్రం 4:25 నిమిషాలకు అయోధ్య రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. తర్వాత అక్కడనుంచి గోరఖ్ పూర్ వెళ్తుంది.