ఒకే కాన్పులో ముగ్గురు జననం..ఆమెకు 10 మంది సంతానం..!

Update: 2023-07-05 14:58 GMT

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా బట్టిగూడెం గ్రామానికి చెందిన ఊకే పొజ్జా అనే మహిళ ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. జూలై 2వ తేదిన నొప్పులు రావడంతో భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో కుటుంబసభ్యులు చేర్చారు. బుధవారం సాయంత్రం ఆమె సుఖ ప్రసవం ద్వారా ఇద్దరు మగ, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మగ శిశువులు 1.8 కిలోలు, 1.75 కిలోలు బరువు ఉండగా.. ఆడ శిశువు 1.5 కిలోల బరువు ఉంది. అయితే ఆ మహిళకు ఇది ఎనిమిదో కాన్పు కావడం గమనార్హం. తాజాగా పుట్టిని ముగ్గురు శిశువులతో కలిపి ఆమె సంతానం 10 మంది. అంతకుముందు పుట్టిన ఏడుగురు పిల్లలు కూడా క్షేమంగా ఉన్నారు. దీంతో మొత్తం పొజ్జా-దేవా దంపతులకు మొత్తం ఐదుగురు మగ పిల్లలు, ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు.



Tags:    

Similar News