Hayat Nagar : మద్యం మత్తులో బస్ కండక్టర్ పై యువతి దాడి...వీడియో వైరల్

Update: 2024-01-31 02:42 GMT

మద్యం మత్తులో నానా రభస చేసే మగవాళ్లను మనం తరచూ చూస్తునే ఉంటాం. కానీ హయత్ నగర్ లో ఓ మహిళ ఫుల్ గా తాగి రచ్చ రచ్చ చేసింది. మద్యం మత్తులో బస్సు ఎక్కిందే కాక బస్సులో నానా హంగామా సృష్టించింది. మత్తులో విచక్షణ మరచిపోయి బస్సు కండక్టర్ పై దాడి చేసి నానా బూతులు తిట్టి కాలితో తన్నింది. బస్సులోని తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించినా సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్ పై దాడికి పాల్పడింది. అయినప్పటికీ ఒక మహిళ అనే గౌరవంతో సదరు కండక్టర్ ఓపికతో ఉన్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




Tags:    

Similar News