విద్యార్థులకు అలర్ట్.. ఎల్లుండి స్కూళ్లు, కాలేజీలు బంద్

Update: 2023-07-10 03:17 GMT

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12 న విద్యాసంస్థలు మూతపడనున్నాయి. ఈ మేరకు ABVP పిలుపునిచ్చింది. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని.. ఈ అక్రమ ఫీజు దోపిడీ దందాను తెరదించేందుకు పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ ప్రకటించింది. వీటితో పాటు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు పూర్తిస్థాయిలో టీచర్లు లేరని, ఇందుకోసం వెంటనే టీచర్ల నియామకం చేపట్టాలని డిమాండ్ చేసింది.

మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జులై 12వ తేదీన స్కూల్స్, కాలేజీలు బంద్ చేయాలంటూ వామపక్ష విద్యార్థి సంఘం(AISF) పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లోని AISF కార్యాలయంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సమావేశమైన నాయకులు.. విద్యారంగ సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందంటూ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటైన దగ్గర నుంచి కూడా సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. తెలంగాణ బడ్జెట్ లో విద్యకు నిధులు కేటాయించకుండా.. విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందంటూ ఆరోపించారు. ఈ సమస్యల పరిష్కారానికై డిమాండ్ చేస్తూ ఈ నెల 12 న తెలంగాణలోని పాఠశాలలు, కాలేజీలు బంద్ చేయాలంటూ..వామపక్ష విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది.



Tags:    

Similar News