తెలంగాణలో సోమవారం అఖిల భారత విద్యార్థి పరిషత్(ABVP) బంద్ కు పిలుపునిచ్చింది. డీఎస్సీ, ఎంఈవో రిక్రూట్‌మెంట్ విడుదల చేసి వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడంతో పాటు.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఏబీవీపీ నాయుకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బుక్స్, యూనిఫామ్ ఇంకా అందజేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు లేకుండా నడిపిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ, అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంతో పాటు.. రాష్ట్రంలో మూసివేసిన 8,624 ప్రభుత్వ పాఠశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ పాటించాలని, విద్యార్థుల తల్లిదండ్రులు బంద్‌కు సహకరించాలని కోరారు.