మర్రిగూడ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు..కోట్లల్లో నగదు, కిలోల కొద్దీ బంగారం

Byline :  Aruna
Update: 2023-09-30 10:05 GMT

రంగారెడ్డి జిల్లాలో భారీ అవినీతి తమింగళం ఏసీబీకి వలలో పడింది. నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్‌ మహేందర్‌రెడ్డి ఇంటిపై ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదు మేరకు అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. వనస్థలిపురం హస్తినాపురంలోని శిరిడిసాయి నగర్‎లోని మహేందర్ రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లకుపైగా నగదును అధికారులు గుర్తించారు. అంతే కాదు భారీగా బంగారాన్ని స్వాధీనం చేస్తున్నాట్లు తెలుస్తోంది. ఓ ట్రంకు పెట్టెలోంచి నగదును బయటకు తీశారు అధికారులు. ఆ పెట్టెలో సుమారు రూ.2 కోట్లకు పైగా నగదును అధికారులు గుర్తించారు. బంగారంతో పాటు స్థిర, చరాస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఎంఆర్‌ఓ మహేందర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 15 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. 




Tags:    

Similar News