తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ దాడులు

Update: 2023-06-06 13:12 GMT

తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం (మే 6) ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. గత కొంత కాలంగా యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ ఈ దాడులు నిర్వహించింది. ప్రస్తుతం యూనివర్సిటీ ఫైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారు. యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా అక్రమాలకు పాల్పడ్డారని.. అక్రమ నియామకాలు, లావాదేవీలు జరిపారని ఆరోపణలు రావడంతో ఈసీ చర్యలకు దిగింది.

వీసీ రవీందర్ గుప్తా అక్రమాలకు చేశారని రిజిస్ట్రార్ ను మారుస్తామని ఈసీ ప్రకటించింది. ఈ ప్రకటనకు వ్యతిరేకంగా కొత్త రిజిస్ట్రార్ ను అపాయింట్ చేస్తూ వీసీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వర్సిటీలో పాలన గందరగోళంగా మారింది. ప్రస్తుతం ఈసీ సభ్యలు, వీసీ మధ్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో యూనివర్సిటీలో ఏసీబీ దాడులు నిర్వహించడం కలకలం రేపింది.

Tags:    

Similar News