Bazar Ghat Fire Incident: నాంపల్లి అగ్ని ప్రమాదంపై ఏసీపీ సంజయ్ కామెంట్స్

Update: 2023-11-14 09:06 GMT

హైదరాబాద్ నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో సోమవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే భవన యజమాని రమేశ్‌ జైస్వాల్‌పై మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి.. రసాయనాల కారణంగా భవనం మొత్తం వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు.

ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న యజమాని రమేశ్‌ జైస్వాల్‌.. భవనంలో చిక్కుకున్న వాళ్లను చూసి స్పృహ తప్పి పడిపోయారని ఏసీపీ సంజయ్ తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను లక్డీకపూల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారని చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమేశ్‌ తమ కస్టడీలోనే ఉన్నాడని.. డిశ్చార్జ్ అయిన వెంటనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.

ఇదిలా ఉండగా.. ఘటన స్థలంలో మరోసారి క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీం క్లూస్ సేకరిస్తున్నాయి. రోడ్డుపై ఆయిల్ పారుతూ ఉండడంతో మట్టి పోసి రోడ్డును సాధారణ పరిస్తితి తెస్తున్నారు జిహెచ్ఎంసి సిబ్బంది. బిల్డింగ్ లోని మిగిలిన ఆయిల్ డ్రమ్ములు బయటకి తరలించారు. అగ్ని ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ కు దగ్గర్లో రమేష్ జైస్వాల్ బాలాజీ ఎంటర్ ప్రాసెస్ షాప్.. షాప్ లో రికార్డులను తనిఖీ చేయడంతో పాటు కార్యకలాపాలను పోలీసులు పరిశీలించారు. సంఘటన స్థలాన్ని క్లూస్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇంచర్జి డాక్టర్ వెంకన్న పరిశీలించారు. ఈ అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోగా.. మరో 10 మంది అపస్మారక స్థితికి చేరుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News