అందోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలం పెరుగుతోంది. మునిపల్లె మండలంలోని పెడ్డలోడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని వీడిన కార్యకర్తలు.. భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పెడ్డలోడి కాంగ్రెస్స్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం, గ్రామ ఉప సర్పంచ్ జగదీశ్వర్, మాజీ ఎంపీటీసి సుదరం, సీనియర్ నాయకుడు అశోక్ పటేల్, పత్తి రాములు, మైనారిటీ నాయకులు నిసార్, వోషిగారి అశోక్, మాజీ బీజేపీ అధ్యక్షుడు బోయిని అంజయ్యతో పాటు.. 200 మందిపైగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ (జూన్ 29) బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, రాష్ట్రంలో రైతులు, పేదలకు అండగా నిలిచిన కేసిఆర్ కు సపోర్ట్ గా బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు కార్యకర్తలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన క్రాంతి కిరణ్.. తెలంగాణ సమగ్ర అభివృద్ది కేసిఆర్ తోనే సాధ్యమన్నారు. అందోల్ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు కృష్టి చేస్తామని.. ప్రజలందరితో మమేకమై పార్టీ అభివృద్ధికి పాల్పడతామని హామీ ఇచ్చారు. దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందని తెలిపారు. ప్రజలందరు ఏకతాటిగా కదిలి వచ్చి కేసీఆర్ కు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నియోజక వర్గానికి మరిన్ని నిధులు మంజూరు అయ్యేలా చూస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు దక్కని హోదా, గౌరవం.. బీఆర్ఎస్ పార్టీలో దక్కుతాయని ప్రజలకు తెలియజేశారు.