దళితుల భూములను కబ్జా చేసిన నటుడు మురళీమోహన్.. బాధితుల ఆందోళన
నటుడు మురళీమోహన్ భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనకు సంబంధించిన జయభేరీ కన్ స్ట్రక్షన్స్ ఉన్న భూమిని కబ్జా చేసినట్లు బాధితులు ఆందోళనకు చేస్తున్నారు. కోకాపేటలోకి దళితుల భూములపై కన్నేసి కబ్జాలు చేస్తున్నారని మండిపడ్డ స్థానికులు.. ఆయర జయభేరి కన్ స్ట్రక్షన్స్ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మురళీ మోహన్ ఆక్రమించారని తమ కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.Actor Murali Mohan grabbed dalit land in Kokapet
తమ భూములను అప్పనంగా కాజేసే ప్రయత్నం చేస్తున్నరని మండిపడ్డారు. ప్రశ్నించే వారిపై దాడులు జరిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు అధికారుల అండతో.. తమ భూములను కబ్జా చేసిన మురళీ మోహన్ పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.