తమిళ స్టార్ నటుడు శివకార్తికేయన్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగస్వాములయ్యారు. శనివారం తన సినిమా ‘మహావీరుడు’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో మొక్క నాటారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన శివకార్తికేయన్.. ప్రముఖ హీరోయిన్ నందితా శ్వేతా విసిరిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను స్వీకరించి బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ లో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా 17 కోట్ల మొక్కలు నాటడం అద్భుతమని ప్రశంసించారు. అందరం కలిసి ప్రకృతి కోసం ఏదో ఒకటి చేద్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి కృషిని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గ్లోబల్ వార్మిగ్ ని అరికట్టడానికి దోహదపడుతుందన్నారు. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో పాల్గొని మొక్కలు నాటాలని శివకార్తికేయన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తన మిత్రుడు, తమిళ్ రాక్ స్టార్ అనిరూధ్ కు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” విసిరారు. ఆయన నాటిన మొక్క వీడియో, ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏషియన్ సినిమాస్ అధిపతి, సినీ నిర్మాత జాన్వీ నారాంగ్ తో పాటు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ప్రతినిధులు పాల్గొన్నారు.
Tamil star @Siva_Kartikeyan takes a green stance! 🌿🌍 Promoting his new movie 'Mahaveerudu', Sivakarthikeyan planted a sapling today in Hyderabad's KBR Park as part of the #GreenIndiaChallenge. Expressing his happiness, he calls on all to join this movement against global… pic.twitter.com/IqbKT59CNK
— Santosh Kumar J (@SantoshKumarBRS) July 8, 2023