Group-2 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్‌-2లో అదనపు పోస్టులు!

Byline :  Vamshi
Update: 2024-02-22 08:03 GMT

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. గ్రూప్-1 మాదిరిగానే గ్రూప్‌-2, గ్రూప్-3 నోటిఫికేషన్లులో అదనపు పోస్టులను కలపాలని టీఎస్‌పీఎస్సీ యోచిస్తున్నట్లు సమాచారం. 2022లో 783 ఖాళీ పోస్టులున్నాయి. గ్రూప్-3లో 13,75 పోస్టులున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరుకు పెరిగిన ఖాళీలతో కలిపి అనుబంధ నోటిఫికేషన్లు రిలీజ్ చేయన్నుట్లు స్పష్టత రావాల్సి ఉంది. గ్రూప్-1 టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 563 పోస్టులతో గ్రూప్‌-1 కొత్త నోటిఫికేషన్‌ను ప్రకటించింది. అదనంగా 60 పోస్టులను కలిపి మరో నోటిఫికేషన్ విడుదల చేశారు.

గ్రూప్‌-2 పరిధిలో ప్రస్తుతం 16 రకాల సర్వీసు ఉద్యోగాలు ఉన్నాయి. ఈ కేటగిరీలోకి మరో ఆరు కేటగిరీల పోస్టులను చేర్చింది. సహాయ సెక్షన్‌ అధికారి(రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సేవలు), సహాయ సెక్షన్‌ అధికారి(ఇతర విభాగాలు), జిల్లా ప్రొబేషనరీ అధికారులు(జువైనల్‌ విభాగం), సహాయ బీసీ సంక్షేమ అధికారులు, సహాయ గిరిజన సంక్షేమాధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల పోస్టుల్ని కొత్తగా చేర్చింది. దీంతో గ్రూప్‌-2 పరిధిలోకి మొత్తం 22 రకాల పోస్టులు వచ్చాయి. సర్కార్ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ తో ఆయా పరిధిలో ఉద్యోగాల సంఖ్య పెరగనుంది. అదనంగా చేర్చినవాటితో కలిపి త్వరలో గ్రూప్‌-2, 3 నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. డిసెంబరు నాటికి ఈ రెండు నోటిఫికేషన్లు వెలువడే ఛాన్స్ ఉంది. తొలుతు గ్రూప్ 2 ఇచ్చిన తర్వాత.. కొద్దిరోజుల తేడాలోనే గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇస్తారని టాక్.

Tags:    

Similar News